మరో ఐటి కారిడార్‌: 25వేల ఉద్యోగాల కల్పన

హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ( ఐటి) కారిడార్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. హౌసింగ్‌ బోర్డు ఆధ్వర్యంలో నిర్మాణమైన సింగపూర్‌ టౌన్‌షిప్‌ సమీపంలో ఈ ఐటి కారిడార్‌ను నెలకొల్పతారు. దీని వల్ల మరో 25 వేల ఐటి ఉద్యోగాల కల్పన జరుగుతుందని హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ మహంతి శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. సింగపూర్‌ టౌన్‌షిప్‌ వద్ద 106 ఎకరాల స్థలంలో ఈ కారిడార్‌ నిర్మాణం జరుగుతుందని ఆయన చెప్పారు. మాదాపూర్‌ వద్ద ఐటి కారిడార్‌ నిర్మిస్తున్న కె. రహెజా కంపెనీకే రెండో కారిడార్‌ నిర్మాణం బాధ్యతలు కూడా అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు రహేజా కంపెనీతో ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. ఐటి కారిడార్‌ నిర్మాణం వల్ల సింగపూర్‌ టౌన్‌షిప్‌ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+