జహీరాకు ప్రలోభాలు:సుప్రీం కమిటీ నిర్ధారణ
న్యూఢిల్లీ:బెస్ట్ బేకరీ కేసులోకీలకసాక్షి జహీరా షేక్‌ని డబ్బుతో మభ్యపెట్టారనిసుప్రీంకోర్టు నియమించిన కమిటీ తేల్చినట్లుతెహల్కా చె బుతోంది. అందువల్లే ఆమెపదేపదే మాట మారుస్తోందని చెప్పింది.ఆమె తన మాట మార్చడానికి గల కారణాలువెలికితీసేందుకు సుప్రీం కోర్టు ఒకకమిటీనిఈ ఏడాది జనవరి 10న నియమించింది. ఆ కమిటీ గురువారంసమర్పించిన నివేదికలో ఈ విషయం ఉందనితెహల్కా పత్రిక కథనం. ఆమె ఉంటున్ననివాసం, ముఖ్యంగా ఆ కాలనీ విహెచ్‌పి, బజరంగ్‌దళ్‌పరిరక్షణలో ఉందని కూడా కమిటీపరిశీలనలో వెల్లడైందని పేర్కొంది.
బిజెపి ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ ఆమెకు 18 లక్షలరూపాయలు ఇచ్చారని తెహల్కా గతంలోనే బయటపెట్టింది.జహీరా షేక్ వడోదరలో ప్రస్తుతం ఉంటున్నగహం అచ్చం హిందువుల ఇంటిలా ఉంటుంది.గణేష్ బొమ్మ వేలాడుతూ ఉంటుంది. స్వస్తిక్ అలాగే ఓంగుర్తులు ఉంటాయి. మీడియా గుర్తుపట్టకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లుకనిపిస్తుంది. ఇంతకు ముందులా భారీ బందోబస్తుకూడా అమెకు లేదు. వడోదర పోలీసులుఇద్దరుఅక్కడికి రౌండ్లకు వెళుతుంటారు.ఆమెఉంటున్న ఇంటి అద్దె నెలకు మూడు వేల రూపాయలు.ఆ మొత్తాన్ని తాను చెల్లించటం లేదని జహీరాకమిటీకి కూడా వెల్లడించింది.












Click it and Unblock the Notifications