సూపర్ సిరీస్‌కూ టెండూల్కర్ దూరం
ముంబాయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వచ్చే నెలలో జరిగే ఐసిసి సూపర్ సిరీస్‌లో కూడా పాల్గొనే అవకాశాలు లేవు. సచిన్ టెండూల్కర్ టెన్నిస్ ఎల్బో గాయం నుంచి ఇంకా కోలుకోలేదని, అందువల్ల టెండూల్కర్ ఆడేందుకు వీలు కాదని బిసిసిఐ వైద్యుగు అనంత్ జోషి బోర్డు నివేదిక సమర్పించారు.
గాయం నుంచి సచిన్ కోలుకుంటున్నాడని, అయితే ఐసిసి సూపర్ సిరీస్‌లో ఆడేందుకు అది అనుమతించదని ఆయన ఒక న్యూస్ చానల్‌కు తెలియజేశారు. టెండూల్కర్ స్థానిక మ్యాచ్‌లేవీ ఆడలేదని, అందువల్ల నేరుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగలడా అనేది సందేహమేనని ఆయన అన్నారు. జోషి ఇది వరకే తన నివేదికను బిసిసిఐ కార్యదర్శి నాయర్‌కు సమర్పించారు. బిసిసిఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications