ప్రభుత్వ వైఫల్యాలే మా విజయానికి మెట్లు: బాబు
చిత్తూరు: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే మున్సిపల్ ఎన్నికల్లో తమకు విజయం చేకూర్చిపెడతాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గురువారంనాడు చిత్తూరు జిల్లాలో రోడ్‌షో నిర్వహించారు. తెలుగుదేశం శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు.
తన సొంత జిల్లా కావడం వల్లనే చిత్తూరు జిల్లాను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిలాగా తాను తన సొంత వ్యవహారాలను ఎప్పుడూ చూసుకోలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దండుకుంటూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications