వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్‌: జింబాబ్వేపై సిరీస్‌ గెల్చుకున్న భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హరారే: జింబాబ్వేపై భారత క్రికెట్‌ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. భారత్‌ జింబాబ్వేను 2-0 స్కోర్‌తో ఓడించి సిరీస్‌ను స్టాగ్‌ రాయల్‌ కప్‌ను కైవసం చేసుకుంది. భారత్‌కు 19 ఏళ్ల తర్వాత విదేశీగడ్డపై సిరీస్‌ విజయం లభించింది. హరారేలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ను భారత్‌ 10 వికెట్ల తేడాతో గెలుచుకుంది. జింబాబ్వే ఆల్‌ రౌండర్‌ బ్లిగ్నాట్‌ గొప్ప పోరాట పటిమను ప్రదర్శించి జట్టుకు ఇన్నింగ్స్‌ ఓటమిని తప్పించారు. బ్లిగ్నాట్‌ 84 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. 19 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌ వికెట్‌ నష్టపోకుండా సునాయసంగా ఛేదించింది. సెహ్వాగ్‌ 14 పరుగులు చేయగా, గంభీర్‌ ఒక పరుగు చేశారు.

రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత సీమర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌కు సింహస్వప్నమయ్యాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఒక టెస్టు మ్యాచ్‌లో 12 వికెట్లు తీసి కుంబ్లే మైలురాయిని దాటాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేసిన జింబాబ్వేకు జవాబుగా భారత్‌ 366 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే కాస్తా మెరుగైన ఆటను ప్రదర్శించి 223 పరుగలు చేసింది. జింబాబ్వే జట్టులో మసకడ్జ, బ్లిగ్నాట్‌ ధీటైన ఆటను ప్రదర్శించి ఒకానొక సందర్భంలో భారత బౌలర్లకు సవాల్‌గా నిలిచారు. ఇన్నింగ్స్‌ చివరలో బ్లిగ్నాట్‌ కుంబ్లే బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో రెండు భారీ సిక్స్‌లను మెరిపించాడు. మసకడ్జ 71 పరుగులు చేశాడు.

వికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న భారత బౌలర్‌ జహీర్‌ఖాన్‌కు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు లభించాయి. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను ఇర్ఫాన్‌ పఠాన్‌ గెలుచుకున్నారు. ఈ సిరీస్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ అద్భుతమైన బౌలింగ్‌ ప్రతిభను కనబరిచాడు. సిరీస్‌లో 21వికెట్లు తీసుకున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X