హర్బజన్‌కు పిసిబి మొట్టికాయలు
చండీఘడ్: భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ హర్బజన్ సింగ్‌కు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మొట్టికాయలు వేసింది. హెచ్చరికలు చేసి ఆయనను వదిలేసింది. జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్‌ను దుయ్యబడుతూ కెప్టెన్ సౌరవ్ గంగూలీని సమర్థిస్తూ హర్బజన్ పత్రికలకు ఎక్కారు. దీనిపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ హర్బజన్‌ను సంజాయిషీ అడిగింది.
గురువారంనాడు హర్బజన్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ముందు హాజరయ్యాడు. చాపెల్‌పై వ్యాఖ్యల విషయంలో హర్బజన్ హద్దులు మీరాడని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అభిప్రాయపడింది. నేరుగా పత్రికా ప్రతినిధులతో మాట్లాడరాదని అసోసియేషన్ హర్బజన్‌ను ఆదేశించింది. హర్బజన్ క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘించాడని పిసిబి అభి।పాయపడింది. హర్బజన్ ఆటపై దృష్టి పెడితే మంచిదని సలహా ఇచ్చింది.












Click it and Unblock the Notifications