ఎంపి రైలు ప్రమాదంలో 16 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 16 మంది మరణించినట్లు, మరో 50 మంది గాయపడినట్లు అనుమానిస్తున్నారు. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ రైల్వే సిగ్నల్ క్యాబిన్‌లోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం సోమవారం ఉదయం గం.8. 15 నిమిసాల ప్రాంతంలో జరిగింది.
వారణాసి నుంచి గ్వాలియర్ వెళ్తున్న ఈ రైలు ప్రమాదానికి గురి కావడంతో ఆరు బోగీలు, ఇంజన్ పట్టాలు తప్పాయి. ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి గల నిర్దిష్ట కారణాలను ఇంకా తెలియాల్సి వుంది. అయితే బ్రేక్‌లు విఫలం కావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టడానికి సీనియర్ రైల్వే అధికారులు, జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం వల్ల రైళ్ల రాకపోకలకు పెద్దగా అంతరాయం కలగబోదని రైల్వే అధికారులు చెప్పారు.
మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు, క్షతగాత్రులకు లక్ష రూపాయలేసి ఎక్స్‌గ్రేషియా ఇస్తూ ఉచిత వైద్యం అందించనున్నట్లు రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు.












Click it and Unblock the Notifications