హైదరాబాద్‌లోనూ సూర్యగ్రహణ ప్రభావం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో స్వల్పంగా సూర్యగ్రహణం కనిపించింది. సోమవారం సాయంత్రం గం.4.25 నిమిషాల ప్రాంతంలో ఇది దర్శనమిచ్చింది. నేరుగా చూడటానికి వీలు లేకపోవడంతో సూర్యగ్రహణాన్ని చూసేందుకు నగరవాసులు వివిధ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది సంపూర్ణ సూర్యగ్రహణమే అయినప్పటికీ హైదరాబాద్‌లో మొత్తం కనిపించలేదు. కొన్ని ఐరోపా దేశాల్లో ఎక్కువగా కనిపించింది. స్పెయిన్‌లో పగలే చీకటి అలుముకుంది. ఈ నెల 17వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ నెల 23వ తేదీన అంగారక గ్రహం భూమికి దగ్గరగా వస్తుంది.

ఇదిలావుంటే, సూర్యగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలన్నింటినీ మూసివేశారు. ప్రసిద్ధ తిరుమల పుణ్యక్షేత్రాన్ని సోమవారం 9 గంటలకు మూసివేశారు. సాయంత్రం ఏడున్నర గంటలకు సంప్రోక్షణ చేసిన తర్వాత భక్తులను అనుమతిస్తారు. తిరుమల కాంపార్ట్‌మెంట్‌ల్లో కూడా ఎవరినీ ఉండనీయడం లేదు. దీంతో ఆశ్చర్యకరంగా తిరుమల నిర్మానుష్యంగా కనిపించింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వంటి అనేక దేవాలయాలను సూర్యగ్రహణం దృష్ట్యా మూసివేశారు.

సూర్యగ్రహణం పట్టినప్పుడు భోజనం చేయకూదనే వాదనను జనవిజ్ఞాన వేదిక ఖండిస్తోంది. గర్భిణీ స్త్రీలు బయట తిరగకూడదనే నమ్మకం కూడా సరైంది కాదని అంటోంది. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదని, నేరుగా చూస్తే కళ్లకు ప్రమాదమని, అంతకు మించిన దుష్ట లక్షణాలేవీ కలగవని అంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+