జపాన్ ఓపెన్: క్వార్టర్ ఫైనల్‌లో సానియా
టోక్యో: జపాన్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ టెన్సిస్ తార సానియా మీర్జా క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో సానియా జపాన్‌కు చెందిన నకమురాను 6-1, 6-4 స్కోర్‌తో ఓడించింది.
సానియా మీర్జా క్వార్టర్ ఫైనల్‌లో రష్యా క్రీడాకారిణి వెరా జ్వొనరేవాతో తలపడుతుంది. ఈ రౌండ్‌లో గెలిస్తే ఆమె సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. రష్యా క్రీడాకారిణి ఇజ్రాయెల్‌కు చెందిన షహార్ పీర్‌ను 6-3, 7-5 స్కోర్‌తో గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. నిన్న జరగాల్సిన రెండో రౌండ్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడడంతో సానియా ఈ రోజు నకమురాతో తలపడింది.












Click it and Unblock the Notifications