సామాజిక కార్యక్రమాలు విస్తృతం: చిరంజీవి
హైదరాబాద్: తన సామాజిక కార్యక్రమాలను కాలానికి అనుగుణంగా మరింత విస్తృత పరుస్తానని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చెప్పారు. పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పద్మభూషణ్ అవార్డు తనకు ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని, మధురానుభూతిని అందించిందని ఆయన చెప్పారు.
తాను మొదటి నుంచీ బాధ్యతయుతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని, దాన్ని కొనసాగిస్తానని ఆయన చెప్పారు. తెర మీద బాధ్యతయుతంగా ఉండడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications