దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది: గవర్నర్‌

హౖెెదరాబాద్‌: దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని గవర్నర్‌ సుశీల్‌కుమర్‌ షిండే అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకిరంచారు. తమకున్న బలాలను, వనరలను యువత ఉపయోగించుకుని ముందుకు సాగాలని ఆయన ఉద్బోధించారు. అందుబాటులో ఉన్న అవకాశాలను యువత వాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలనికి ఉన్న అన్నపూర్ణ అనే పేరు సార్థకం అయ్యేలా అభివృద్ధి సాధిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం తలపెట్టిన 26 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. చెదురుమొదురు సంఘటనలు మినహా గత 20 నెలల కాలంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రాల సహకారంతో నక్సల్స్‌ను అరికట్టడంలో కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ఆయన అన్నారు. శకటాల ప్రదర్శన జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+