అసెంబ్లీకి కాలినడకన బిజెపి ఎమ్మెల్యేలు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభ్యులు జి కిషన్ రెడ్డి, దొరబాబు కాలినడకన మంగళవారం శాసనసభకు వచ్చారు. అంబర్‌పేట నుంచి ప్రారంభించిన కాలినడక యాత్ర అసెంబ్లీకి చేరింది. వెనకబడిన తరగతుల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బిజెపి శాసనసభ్యులు ఈ కాలినడక క్యాక్రమాన్ని చెప్పారు.
బడ్జెట్‌లో బిసి విద్యార్థులకు మరిన్ని నిధులు కల్పించాలని కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిసి విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల విడుదలకు ప్రత్యే నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications