పోలవరంపై తెరాసది రాజకీయం: సిపియం
హైదరాబాద్: గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎవరు ముందుకు వచ్చినా కలిసి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిపియం శాసనసభ్యుడు తమ్మినేని వీరభద్రం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పోరాటంలో రాజకీయ ఉద్దేశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి బదులు తెరాస తమను విమర్శించడానికే ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తప్పు పట్టారు. తెరాసతో తమకు రాజకీయ విభేదాలున్నా పోలవరం ప్రాజెక్టు మీద మాత్రమే ముందుకు వస్తే కలిసి పని చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications