కరువు ప్రాంతాల్లో ఐదంచెల జలవిధానం: గవర్నర్
హైదరాబాద్: కరవు ప్రాంతాల్లో ఐదంచెల జల విధానాన్ని అనుసరించనున్నట్లు గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ చెప్పారు. కరువు ప్రాంతాలకు సాగునీరు అందించడానికి ఈ విధానాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. గవర్నర్ తన ప్రసంగంతో మంగళవారం శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. తన ప్రసంగంలో గవర్నర్ జల యజ్ఞానికి ప్రాధాన్యం ఇచ్చారు. గవర్నర్ సాగునీటి ప్రజెక్టుల గురించి ప్రాస్తవించినప్పుడు ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని ఆయనచెప్పారు. విశాఖపట్నం, విజయవాడల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నట్లు ఆయనతెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల మంచినీటి కోసం మరో 90 ఎంసిడిల నీటిని తరలించునున్నట్ల ఆయన తెలిపారు.
రాష్ట్రంలో 20 జిల్లాల్లో హెచ్‌ఐవి చాలా వున్నాయిన, రాష్ట్రంలో ఎయిడ్స్ తీవ్ర స్థాయిలో ఉందని, దాని నివారణకు ప్రత్యేక కృషి నిర్వహంచనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications