తెలుగుకు ప్రాచీన హోదాకు బాబు పిటిషన్
హైదరాబాద్: తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా కల్పించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, అధికార భాషా సంఘాన్ని ఆయన తన రిట్ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.
తమిళభాషకు ప్రాచీన భాష హోదా కల్పిస్తూ తెలుగుకు కల్పించకపోవడం అన్యాయమని ఆయన తన రిట్ పిటిషన్‌లో అన్నారు. ఈ రిట్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications