గవర్నర్ ప్రసంగం దిశారహితం: ప్రతిపక్షాలు
విద్య, వైద్యం, ఉపాధి, రైతాంగ సమస్యలు, విద్యుత్, సంక్షేమం వంటి ప్రధానమైన అంశాలను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించకపోవడం దారుణమని వామపక్షాలు విమర్శించాయి. గవర్నర్ తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్లీనరీని ప్రస్తావించడం సరైంది కాదని తెలుగుదేశం పార్టీ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు అన్నారు. గవర్నర్ ప్రసంగం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రసంగంలా ఉందని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంలో భవిష్యత్తు కార్యాచరణ లేదని తెలంగాణ రాష్ట్ర సమితి విమర్శించింది.












Click it and Unblock the Notifications