పోతిరెడ్డిపాడుపై వైయస్ ప్రకటనకు పిజెఆర్ పట్టు
హైదరాబాద్: రాయలసీమలో చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ఎత్తు పెంపును కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి మళ్లీ ముందుకు తెచ్చారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ వల్ల తెలంగాణకు అన్యాయం జరగదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేయాలని జనార్దన్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సియల్‌పి) సమావేశంలో డిమాండ్ చేశారు.
జనార్దన్ రెడ్డి డిమాండ్‌తో సియల్‌పి సమావేశంలో గందరగోళం చెలరేగింది. అయితే పోతిరెడ్డిపాడుపై సందేహాలను భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివృత్తి చేస్తారని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ఎత్తు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని జనార్దన్ రెడ్డి గతంలో డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications