జయ ప్రభుత్వంపై పొన్నాల మండిపాటు
హైదరాబాద్: పాలారు నదిపై ప్రాజెక్టును నిర్మించే విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంపై రాష్ట్ర భారీ నీటి పారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం పాలార్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పాలార్ నదిపై ప్రాజెక్టు నిర్మించేందుకు ఇప్పటి వరకు ఏ విధమైన ప్రణాళికనూ రూపొందించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన మాత్రం ఉందని, నిపుణుల పరిశీలనకు ఆదేశాలిచ్చామని ఆయన చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications