ఎమ్మెల్యేలకు స్పీకర్ అల్పాహార విందు
హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి అన్ని పార్టీల శాసనసభ్యులకు మంగళవారం ఉదయం జూబిలీహాల్‌లో అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభ్యులు మినహా మిగతా అన్ని పార్టీల శాసనసభ్యులు హాజరయ్యారు.
ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు జూబిలీ హాల్‌కు చేరుకున్న కొద్దిసేపటికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వచ్చారు. అందరూ పరస్పరం పలకరించుకుంటూ, అభివాదాలు చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 28వ తేదీ వరకు సాగుతాయి. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పరస్పరం అభివాదం చేసుకున్నారు. పక్కపక్కన కూర్చుని ఉల్లాసంగా మాట్లాడుకున్నారు.












Click it and Unblock the Notifications