తెలంగాణ రాజ్‌నాథ్ ప్రకటనే ఫైనల్: అద్వానీ
తిరుపతి: తెలంగాణపై తాము తమ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనకు కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ స్పష్టం చేశారు. తెలంగాణపై తమ పార్టీ స్పష్టంగా ఉందని ఆయన సోమవారం తిరుపతిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయ చేస్తోందని ఆయన విమర్శించారు.
తెలంగాణపై కాంగ్రెస్ కేంద్రంలో ఒక రకంగా, రాష్ట్రంలో మరో రకంగా మాట్లాడుతోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టాలని చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రతిపాదించాలని ఆయన కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. బిల్లు ప్రతిపాదించకుండా కాంగ్రెస్ బిజెపి వైఖరి స్పష్టం చేయాలనడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications