టిడిపి ఎమ్మెల్యేలపై పెట్టిన కేసులో మార్పులు
హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై ప్రభుత్వం పెట్టిన కేసులో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో నడచిన వ్యవహారాలపై పోలీసు కేసు నమోదు చేయడానికి వీలు లేదని తెలుసుకున్న ప్రభుత్వం కేసులో మార్పునకు సిద్ఢపడినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రస్తావన లేకుండా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పత్రికల్లో చేసిన ప్రకటనలపై కేసు నమోదు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
తెలుగుదేశం శాసనసభ్యులపై సిఐడి కూడా కేసు నమోదు చేసింది. శాసనసభ్యులపై నమోదు చేసిన కేసులో ఎంత మంది పేర్లున్నాయనేది ఇంకా స్పష్టం కాలేదని సిఐడి డిజి రతన్ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన విషయాలపై పోలీసు కేసు నమోదు చేయడానికి వీలు లేదని తెలుసుకున్న ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. మీడియా వార్తల ప్రాతిపదిక మీదనే ప్రభుత్వం కేసులు పెడుతోంది. నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శర్మ ఇచ్చిన ఫిర్యాదులో శాసనసభ్యుల పేర్లు లేవు. దీంతో ఎవరి మీద కేసు పెట్టాలనే విషయాన్ని పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. తాము దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications