మార్కెట్ రేటు చెల్లింపు సాధ్యం కాదు: వైయస్
హైదరాబాద్: పారిశ్రామికాభివృద్ధి జరుగుతున్న సమయంలో రైతులు భూములు కోల్పోవడం మామూలేనని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఆ విధంగా అన్నారు. సంస్కృతీ సంప్రదాయాలకు హైదరాబాద్ నిలయంగా మారుతోందని ఆయన అన్నారు.
అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం శంషాబాద్, తదితర ప్రాంతాల్లో రైతులు భూములు కోల్పోతున్నారని, భూములు కోల్పోతున్న రైతులను ఆదుకుంటామని ఆయన అన్నారు. అయితే రైతులకు మార్కెట్ రేటు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన అన్నారు. రైతులు ఎకరానికి లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, అంత మొత్తం చెల్లించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని, అయితే నష్టం జరగకుండా చూస్తామని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications