వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు సొంత కారు లేదు

By Staff
|
Google Oneindia TeluguNews

రాయ్‌బరేలీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సొంత కారు లేదు. ఆమె వద్ద నగదు రూపంలో కేవలం 20 వేల రూపాయలు మాత్రమే వున్నాయి. అయితే ఆమెకు ఇటలీలో వారసత్వంగా సంక్రమించిన ఒక ఇల్లు ఉంది. దాని ఖరీదు 13 లక్షల రూపాయలు. రాయబరేలీ లోక్‌సభ స్థానానికి వేసిన నామినేషన్‌ పత్రాలకు ఆమె జత చేసిన ఆర్థిక డిక్లరేషన్‌లో ఆ విషయాలు ఉన్నాయి. రాయబరేలీ నియోజకవర్గం నుంచి ఆమె సోమవారంనాడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు కుమారుడు రాహుల్‌ గాంధీ, కూతురు ప్రియాంక ఉన్నారు.

యూకో బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాలో సోనియాకు 85,338 రూపాయలున్నాయి. అదే బ్యాంక్‌లో 20 లక్షల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. ఆమెకు 12 లక్షల ఆర్‌బిఐ బాండ్లు, 52,800 రూపాయల యుటిఐ బాండ్లు ఉన్నాయి. మారుతి టెక్నికల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సోనియాకు పది షేర్లు ఉన్నాయి. అయితే డిక్లరేషన్‌లో వాటి విలువ తెలియజేయలేదు. వెస్టర్న్‌ ఇండియా టాన్నరీస్‌లో 500 షేర్లు ఉన్నాయి. వీటి విలువను కూడా తెలియజేయలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X