ఎమ్మెల్యేలపై కేసు: సోమనాథ్‌కు ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి తప్పుడు పత్రాలు చూపించారని ఆరోపిస్తూ ప్రభుత్వం తమ శాసనసభ్యులపై కేసు పెట్టడంపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ప్రతినిధులు సోమవారం లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీకి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడి నేతృత్వంలోని పార్లమెంటు సభ్యుల బృందం సోమనాథ్ ఛటర్జీని కలిసి ఆ ఫిర్యాదు చేసింది.
శాసనసభ స్పీకర్ కె. సురేష్ రెడ్డి నుంచి వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తానని సోమనాథ్ ఛటర్జీ తమకు హామీ ఇచ్చినట్లు ఎర్రంనాయుడు మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఈ కేసుపై రాజ్యసభ చైర్మన్ బైరాన్ సింగ్ షెకావత్‌ను కలిసి వివరించినట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో శాసనసభ్యులపై కేసు పెట్టడం సరైంది కాదని ఎర్రంనాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications