రోడ్డు ప్రమాదంలో 7గురు దుర్మరణం
కర్నూలు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె వద్ద జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చారు. లారీ, బస్సు డ్రైవర్లు మరణించినవారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో లారీలో ప్రయాణిస్తున్నవారు ఐదుగురున్నట్లు వారు తెలిపారు.
హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తున్న కాళేశ్వర ట్రావెల్స్ బస్సు, కడప నుంచి వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ మృతి చెందగా, ప్రయాణికులంతా క్షేమంగానే వున్నారు. ప్రమాదంలో మరణించిన లారీ డ్రైవర్, మరో వ్యక్తి మహారాష్ట్రలోని లాథూర్‌కు చెందినవారని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications