ఎడిబి ఎజియం వేదిక హైదరాబాద్
న్యూఢిల్లీ: ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) వార్షిక సర్వసభ్య సమావేశానికి (ఎజియం) హైదరాబాద్ వేదిక కాబోతోంది. ఈ సమావేశం మే 3 నుంచి 6 వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. ఈ సమావేశం దేశ అభివృద్ధి సామర్థ్యంపై విశ్వాసానికి ఓటు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ప్రతిష్ఠాత్మకమైన సమావేశంలో 64 ఎడిబి సభ్య దేశాలు పాల్గొంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రి దీనికి అధ్యక్షత వహిస్తారు. ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు, ఆర్థికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పలువురు పాల్గొంటారు. ఈ సమావేశానికి 2 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. పెట్టుబడులకు దేశంలో వున్న అవకాశాలను తెలియజేయడానికి ఇది మంచి అవకాశమని చిదంబరం అన్నారు. ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో పాటు 5 మందికి అతిథ్యం ఇచ్చే వెసులుబాటు ఉన్నందున హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ను వేదికగా ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications