ముందు వైయస్‌లో మార్పు రావాలి: బాబు
హైదరాబాద్: ఫాక్షనిజాన్ని అంతమొందించాలనే చిత్తశుద్ధి వుంటే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిలో మార్పు రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా రాజశేఖర్ రెడ్డిలో మార్పు రాలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఒక వైపు ఫాక్షనిజాన్ని ప్రోత్సహిస్తూ హత్యలకు చేయిస్తూ హంతకుల కొమ్ము కాస్తున్న రాజశేఖర్ రెడ్డి ఫాక్షనిజాన్ని అంతమొందిస్తానని అనే హక్కు లేదని అని ఆయన అన్నారు. ఫాక్షనిజాన్ని అంతమొందించడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని, అయితే ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు.
నేరమయ రాజకీయాలపై, ఫాక్షనిజంపై విస్తృత చర్చ జరగాలని ఆయన అన్నారు. ఫాక్షనిజాన్ని అంతమొందించడానికి ముందు విధివిధానాలను రూపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరి పార్టీలో ఎక్కువ మంది ఫాక్షనిస్టులున్నారో తేల్చడానికి బహిరంగ చర్చకు రావాలని ఆయన ముఖ్యమంత్రిని సవాల్ చేశారు. తమ పార్టీ కార్యకర్తలను 85 మందిని కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని, అటువంటి ప్రభుత్వం ఫాక్షనిజాన్ని అంతమొందిస్తాననడం సిగ్గుచేటు అని ఆయనఅ ఆన్నారు. ముఖ్యమంత్రి హత్యలను ప్రోత్సహించడం వల్లనే రాజకీయ హత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications