మహాజన్ ఆరోగ్యం ఇంకా విషమమే
ముంబాయి: సోదరుడు ప్రవీణ్ మహాజన్ జరిపిన కాల్పుల్లో గాయపడిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు. ప్రమోద్ మహాజన్ మూత్రపిండాలు సరిగా పని చేయడం లేదని వారు చెప్పారు. ప్రమోద్ మహాజన్‌కు డయాలసిస్ నిర్వహిస్తున్నారు. ప్రమోద్ మహాజన్ హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
మహాజన్‌కు కాలేయ మార్పిడి అవసరం లేదని కాలేయ సర్జన్ రవీంద్రనాథ్ చెప్పారు. మహాజన్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ ముంబాయి వచ్చారు. ఆయన హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిన తర్వాత ఒక వార్తాసంస్థతో మాట్లాడారు. ప్రసుత్త కాలేయంతోనే మహాజన్ జీవించగలడని, అది పెరుగుతుందని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications