మా నాన్న కోలుకుంటున్నారు: ప్రమోద్ కుమారుడు
న్యూఢిల్లీ: సోదరుడు ప్రవీణ్ మహాజన్ కాల్పుల్లో గాయపడి హిందూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. మహాజన్ పరిస్థితి మెరుగుపడుతోందని ఆయన కుమారుడు రాహుల్, బావ, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి గోపినాథ్ ముండే సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. త్వరలోనే ప్రమోద్ మహాజన్ కోలుకోగలరని వారు ఆశించారు.
వైద్యులు అద్భుతంగా వైద్యం చేస్తున్నారని రాహుల్ అంటూ వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ ఆస్పత్రి వైద్య బృందంతో పాటు బ్రిటన్ నుంచి వచ్చిన వైద్యులు ప్రమోద్ మహాజన్‌కు చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షా కాలంలో ప్రార్థనలు మాత్రమే సహాయం చేస్తాయని ఆయన అన్నారు. తన తండ్రి కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నవారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications