దాడిలో గాయపడిన దర్శకుడు రాజమౌళి

హైదరాబాద్‌: తెలుగు చలనచిత్ర దర్శకుడు రాజమౌళిపై దుండగులు సోమవారంనాడు దాడి చేశారు. రాయదుర్గం సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దుండగలు పరికరాలను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజమౌళిని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. విక్రమార్కుడు చిత్రం షూటింగ్‌ సందర్భంగా ఈ దాడి జరిగింది. సినిమా యూనిట్‌పై కూడా దుండగులు దాడి చేశారు. విక్రమార్కుడు సినిమాలో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. స్థానికులకు, సినిమా యూనిట్‌కు మధ్య చెలరేగిన ఘర్షణ ఈ దాడికి దారి తీసినట్లు తెలుస్తోంది.

క్వారీ వద్ద విక్రమార్కుడు సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ షూటింగ్‌ కోసం క్వారీ యజమాని జ్ఞానేశ్వర్‌ నుంచి అనుమతి పొందారు. అయితే షూటింగ్‌ జరుగుతున్న సమయంలో క్వారీ కార్మికులు బ్లాస్టింగ్‌ జరుపడం మొదలు పెట్టారు. బ్లాస్టింగ్‌ జరపడాన్ని యూనిట్‌ మేనేజర్‌ రమేషర్‌ అభ్యంతర పెట్టారు. అనుమతిచ్చి బ్లాస్టింగ్‌ జరపడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో స్థానికులు రాజమౌళిపై, సినిమా యూనిట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో రాజమౌళితో పాటు మరికొంత మంది గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+