జమ్ములో తీవ్రవాదుల ఊచకోత: 22 మందిమృతి
జమ్ము: జమ్ము కాశ్మీరులో తీవ్రవాదులు ఆదివారం అర్ధరాత్రి 22 మంది అమాయక ప్రజలను ఊచకోత కోశారు. సాయుధులైన లష్కరే తోయిబా తీవ్రవాదులు దోడా జిల్లాలోని మారుమూల గ్రామాలైన పాంజ్ దోబీ, తావా గ్రామాలను చుట్టుముట్టి గ్రామస్ధులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపొరు. గ్రామస్ధులను ఇళ్ళలోంచి బయటికి లాగి కాల్పులు జరపడంతో 22 మంది మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.












Click it and Unblock the Notifications