బిచ్చగాళ్ళకు ఇళ్ళు: ముఖ్యమంత్రి హామీ
హైదరాబాద్: జంటనగరాల్లో చెత్త ఏరుకునేవారికి, బిక్షగాళ్ళకు త్వరలో ఇళ్ళు కట్టిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మేడే సందర్భంగా ప్రకటించారు. చెత్త ఏరుకునేవారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తామని నగరపాలక సంస్ధ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చెప్పారు. ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని, అందులో భాగంగా బిచ్చగాళ్ళకు, చెత్తఏరుకునే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పించనున్నామని ఆయన తెలిపారు. వీరికి ఇళ్ళు నిర్మించి ఇచ్చే కార్యక్రమం మూడు నెలల్లో ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్‌ను బిచ్చగాళ్ళ రహిత నగరంగా మార్చుతామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications