జయేంద్ర సరస్వతికి సుప్రీంకోర్టు రిలీఫ్‌

న్యూఢిల్లీ: జయేంద్ర సరస్వతి ప్రధాన నిందితుడిగా ఉన్న శంకరరామన్‌ హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పాండిచ్చేరి కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టు బ్రేకు వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఈ కేసులో తదుపరి విచారణను చేపట్టవద్దంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బాలకృష్ణన్‌, జస్టిస్‌ డికె జైన్‌ ఆదేశించారు. పాండిచ్ఛేరి కోర్టుకు తమిళనాడు ప్రభుత్వ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎందుకు హాజరు కావాలని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని వారు వ్యాఖ్యానించారు. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు జులై రెండో వారానికి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+