ఐదో నెంబర్ జీవోను సవరిస్తాం: వైయస్
హైదరాబాద్: ఉద్యోగులను తొలగించడానికి జారీ చేసిన ఐదో నెంబర్ జీవోను సవరిస్తామని, ఆర్టీసిపై దాని ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం తనను నేషనల్ మజ్దూర్ యూనియన్ (యన్‌యంయు) నేతలకు ఆయన ఆ హామీ ఇచ్చారు.
ఇదిలావుంటే, ఐదో నెంబర్ జీవోను వ్యతిరేకిస్తూ ఐక్య ఉద్యమాన్ని చేపట్టేందుకు కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 7వ తేదీన కార్మిక సంఘాలు సమావేశమై ఉద్యమాన్ని ఖరారు చేయనున్నట్లు సిఐటియు నేత వీరయ్య బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. జీవోను వ్యతిరేకిస్తూ దీర్ఘకాలిక ఉద్యమానికి రూపకల్పన చేస్తామని ఆయన చెప్పారు. జీవోను రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications