మావోయిస్టులను ఎవరినీ వదలం: డిజిపి

హైదరాబాద్‌: మావోయిస్టులు ఇంకా 650 మంది మిగిలారని, వారిలో ఎవరినీ వదలబోమని రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ సేన్‌ అన్నారు. మావోయిస్టుల చర్యలను తాము సమర్థంగా అడ్డుకుంటామని ఆయన బుధవారంనాడు అన్నారు. మావోయిస్టుల యాక్షన్‌ టీమ్‌లకు తాము భయపడబోమని ఆయన చెప్పారు. నల్లమల పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చిందని ఆయన చెప్పారు. ఇక ఆంధ్రా ఒరిస్సా సరిహద్దును లక్ష్యంగా ఎంచుకుంటామని ఆయన ఒక ప్రైవేట్‌ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

తమ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్‌ ఎన్‌కౌంటర్‌ అనంతరం మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌లు రంగంలోకి దిగాయనే సమాచారంతో హైదరాబాద్‌లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాసనసభ, సచివాలయం వంటి ప్రధానమైన కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. రద్దీ అధికంగా ఉండే కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెత్తకుండీల వంటి ప్రాంతాల్లో జాగిలాలతో, బాంబు స్వ్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజధాని నగరంలోకి ఐదుగురు మావోయిస్టుల యాక్షన్‌ టీమ్‌ ప్రవేశించిందనే ఊహాగానాలు చెగలరేగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+