ఏం చేస్తామో 15 తర్వాత మీరే చూస్తారు: నరేంద్ర
న్యూఢిల్లీ: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. ఈ విషయమైన తమ అగ్రనేత కె. చంద్రశేఖరరావు రేపు (గురువారం) ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే యుపిఎ నుంచి వైదొలుగుతామని తాము ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, సోనియాకు చెప్పబోతున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రం ఏర్పాటుకు కాస్తా ఆలస్యంగా చర్యలు తీసుకున్నా సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతామని ఆయన చెప్పారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే పార్లమెంటులో ఆగస్టు 15వ తేదీ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications