కృషి కొసరాజుకు నార్కో ఎనాలిస్ టెస్ట్జుకు పిటిషన్
హైదరాబాద్: డిపాజిటర్లను మోసగించి బ్యాంకాక్‌కు పారిపోయి పోలీసుల చేతికి చిక్కిన కృషి బ్యాంకు చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావుకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ సిఐడి పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుగుతుంది.
కృషి బ్యాంకు వ్యవహారంలో పెద్దల ప్రమేయం లేదని వెంకటేశ్వరరావు చెప్పిన మాటలను పోలీసులు విశ్వసించడం లేదు. ఈ వ్యవహారంలో పెద్దల ప్రమేయం ఉందని సిఐడి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొసరాజు వెంకటేశ్వరరావుకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. ఇద్దరు మాజీ పోలీసు డైరెక్టర్స్ జనరల్ (డిజిపిల) పేర్లను వెంకటేశ్వరరావు వెల్లడించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications