బంధుమిత్రుల సంఘానికి మావోయిస్టు మృతదేహం
హైదరాబాద్: నల్లమల ఎన్‌కౌంటర్‌లో మరణించిన మహిళా మావోయిస్టు మృతదేహాన్ని అమర వీరుల బంధు మిత్రుల సంఘానికి అప్పగించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇటీవల నల్లమల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ సహా 8 మంది నక్సలైట్లు మరణించారు. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టును మొదట రమగా గుర్తించారు. అయితే అది రమది కాదని ఆమె మేనమామ చెప్పాడు. దీంతో ఆ మృతదేహాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో గుంటూరు ఆస్పత్రిలోనే ఆ మృతదేహం వుంది.
గుర్తించని మహిళా నక్సలైట్ మృతదేహాన్ని తమకు అప్పగిస్తే అంత్యక్రియలు చేస్తామని కోరుతూ అమరవీరుల బంధు మిత్రుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. గుర్తించని ఆ మృతదేహాన్ని అమర వీరుల బంధు మిత్రుల కమిటీకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ మృతదేహాన్ని అడ్డం పెట్టుకుని ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించబోమని ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌కు హామీ పత్రం రాసిచ్చి మృతదేహాన్ని తీసుకోవాలని హైకోర్టు బంధు మిత్రుల సంఘాన్ని ఆదేశించింది.












Click it and Unblock the Notifications