పోటీకి సిద్ధంగా ఉన్న 600 గుర్రాలు
హౖెెదరాబాద్, జులై 18: హైదరాబాద్ రేస్ క్లబ్ వర్షాకాల సీజన్ ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. 600 గుర్రాలు పోటీపడనున్నాయి. ఇందులో రెండేళ్ళ గుర్రాలు 158 ఉన్నాయి. ఈ సీజన్‌లో స్టేక్ మనీ రూ 47,33,750 పెరగడంతో మొత్తం స్టేక్ మనీ ఆల్‌టైం రికార్డు అయిన రూ 3,69,79,000 కు చేరుకోనుంది. మొత్తం ట్రోఫీల విలువ రూ. 9,75,000కు చేరుకోనుంది. హిందూ డెక్కన్ డెర్బీ అక్టోబర్ రెండున జరుగనుంది. ఈ సీజన్ కోసం రేస్‌కోర్సు సుందరీకరణ పనులు పూర్తయ్యాయి.
హైదరాబాద్ రేస్ క్లబ్ ఈ సంవత్సరం రూ 20 కోట్ల రూపాయలను పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఇది రెండు కోట్లు అదనం. కర్నాటకలో గుర్రపు పందేలపై పన్ను నాలుగు శాతం మాత్రమే ఉందని, అందువల్ల మన రాష్ట్రం నుంచి పంటర్లు అక్కడికి ఆకర్షితులవుతున్నారని హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్, మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలో పన్ను శాతాన్ని తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నంలో ఆఫ్‌కోర్సు కేంద్రం ప్రారంభమైందని, త్వరలో గుంటూరులో మరో ఆఫ్‌కోర్సు కేంద్రం ప్రారంభం కానుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications