ఆక్యురా క్లాసిక్‌ : మూడో రౌండ్‌లో సానియా

సాన్‌డీగో: అక్యురా క్లాసిక్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి సానియా మీర్జా మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. రెండో రౌండ్‌లో స్లోవేనియాకు చెందిన 15వ సీడ్‌ కాతరినా స్రెబోత్నిక్‌ను సానియా ఓడించింది. స్రెబోత్నిక్‌ను సానియా 6-3, 7-5 వరుస సెట్లలో ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది.

మూడో రౌండ్‌లో సానియా రష్యాకు చెందిన నాలుగో సీడ్‌ ఎలెనా డెమెంటోవాతో తలపడుతుంది. వింబుల్డన్‌ తొలి రౌండ్‌లో సానియా డెమెంటోవా చేతిలో ఓడిపోయింది. ఆక్యురా క్లాసిక్‌లో డెమెంటోవా అమెరికాకు చెందిన ఆస్లే హార్క్‌రోడ్‌ను 6-2, 6-2 స్కోర్‌తో ఓడించింది. ఇటీవల వరుసగా విఫలమవుతూ ర్యాంకింగ్‌లో దిగువకు పడిపోతూ వస్తున్న సానియా ఈ టోర్నమెంట్‌లో కాస్తా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+