అభివద్ధి ప్రాజెక్టుల్లో భూనిర్వాసితులకు వాటా: సియం
చెన్నై: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కోసం, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు ఆ ప్రాజెక్టుల్లో వాటా ఇవ్వాలనే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన గురువారం ఆ విషయం చెప్పారు. రైతులకు వాటా ఇచ్చే పథకంపై త్వరలోనే ఒక ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు.
మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల అభివృద్ధి జరిగిన తర్వాత భూములు కోల్పోయిన రైతులకు, పేదలకు వాటిలో 10 శాతం వాటా ఇస్తామని, దీని వల్ల రైతులకు, పేదలకు ఫలితం దక్కుతుందని ఆయన అన్నారు. తాము సేకరించిన భూముల్లో 40 శాతం ప్రాజెక్టులకు ఉపయోగించడం జరుగుతుందని, మిగతా ఖాళీగా వుంటుందని ఆయన చెప్పారు.చెన్నైకి కృష్ణా జలాలు విడుదల చేయాలంటే కరుణానిధి ప్రభుత్వం కర్ణాటక, మహారాష్ట్రలపై ఒత్తిడి తేవాలని వైయస్ అన్నారు.












Click it and Unblock the Notifications