నిజ జీవితంలోనూ చిరు హీరో: జయప్రకాశ్
మెదక్: ప్రముఖ సినీనటుడు చిరంజీవి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ హీరో అని లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. పార్టీ స్థాపన కోసం జిల్లాలవారీగా సన్నాహక సదస్సుల నిర్వహణలో భాగంగా ఆయన సోమవారంనాడు మెదక్‌కు వచ్చారు. చిన్న చిన్న సమావేశాల ద్వారా ప్రజలను సమీకరించే ప్రయత్నం చేయడం మంచిదని ఆయన అన్నారు. ఉచిత విద్యను, రైతులకు వడ్డీ షరతులు లేని రుణాలను అందించడం తమ ఉద్దేశమని ఆయన అన్నారు.
తమతో ఏ పార్టీ కలిసి వచ్చిన సమైక్య పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. త్వరలో గ్రామ, మండల స్థాయి కమిటీలు వేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications