నాయుడి మృతికి సంతాపం: లోక్‌సభ వాయిదా
న్యూఢిల్లీ: తెలుగుదేశం సభ్యుడు కె.పి. నాయుడు మృతికి సంతాపసూచకంగా సోమవారం లోక్‌సభ వాయిదా పడింది. కె.పి. నాయుడు ఈ నెల 19వ తేదీన కన్నుమూశారు. సభ సమావేశం కాగానే స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 76 ఏళ్ల కె.పి. నాయుడు మరణించిన విషయాన్ని ప్రకటించారు. కె.పి. నాయుడు బొబ్బిలి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
ప్రముఖ షెహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ కన్ను మూసిన విషయాన్ని కూడా సోమనాథ్ ఛటర్జీ సభలో ప్రకటించారు. ఆ ఇద్దరి మృతికి సంతాపసూచకంగా సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications