ఐదుగురిని చితకబాదిన స్థానికులు: ఒకరి మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సమీపంలోని ఆల్వాల్‌ ప్రాంతంలో స్థానికులు దొంగలనే భయంతో ఐదుగురిని చితకబాదారు. స్థానికుల చిత్రహింసలకు తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి మరణించాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడం గమనించిన స్థానిక ప్రజలు వారిని పట్టుకున్నారు. వారిని తీవ్రంగా కొట్టారు.

ఆ ఇద్దరు ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని పట్టుకున్నారు. మొత్తం ఐదుగురిని తాళ్లతో కట్టేసి తీవ్రంగా కొట్టారు. పోలీసులకు కూడా తెలియజేయకుండా రాత్రంతా చిత్రహింసలు పెట్టారు. చిత్రహింసలకు గురైనవారంతా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారని తెలుస్తోంది. తాము దొంగలం కాదని చెప్పినా వినకుండా తమను చిత్రహింసలు పెట్టారని స్థానికులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+