కరణం బలరాంకు 15 రోజుల రిమాండ్‌

ఒంగోలు: ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే కరణం బలరాం (తెలుగుదేశం)కు జిల్లా మెజ్రిస్టేట్‌ 15 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ఉదయలక్ష్మిని దూషించారన్న ఆరోపణ మీద కరణం బలరాం మీద మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. యాదవ కులాలానికి చెందిన ఐఎఎస్‌ అధికారి ఉదయలక్ష్మిని కరణం బలరామ్‌ దూషించడంపై యాదవ సంఘాలు కూడా తీవ్రంగా విమర్శించాయి.

ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నందుకు మనం సిగ్గు పడాలి అని మాత్రమే తాను కలెక్టరుతో అన్నానని, కేవలం ఆమెను ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేయలేదని మంగళవారం ఆయన వివరణ ఇచ్చుకున్నారు. బదిలీ భయంతో ఉదయలక్ష్మి తన మీద పెద్ద దుమారం రేపి, ముఖ్యమంత్రి దృష్టిలో పడాలనుకుంటున్నారని కరణం బలరాం అభియోగం. ఇలా ఉండగా ఆయనను మద్దిపాడు పోలీసు స్టేషన్‌ నుంచి ఒంగోలుకు తరలిస్తుండగా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+