లగడపాటి, సర్వేలది ఒక నాటకం: బిజెపి
హైదరాబాద్: నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీద జరిగిన దాడి ఒక నాటకమని భారతీయ జనతాపార్టీ మంగళవారం ఇక్కడ అభివర్ణించింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సర్వే సత్యనారాయణ, ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పైకి ఘర్షణ పడుతున్నట్టు కన్పించినా ఇద్దరూ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని పొగుడుతున్నారని, ఆయన వంటి సిఎం లేరని అంటున్నారని, దీనిని బట్టి ఇదొక పెద్ద నాటకమని అర్ధమవుతోందని బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు. తెలంగాణ అంశంపై సర్వే సత్యనారాయణ, లగడపాటి రాజగోపాల్ కొంతకాలంగా ఘర్షణ పడుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications