తెలంగాణపై మాట్లాడొద్దు: కాంగ్రెస్ హైకమాండ్
హైదరాబాద్: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ నాయకులెవరూ మాట్లాడకూడదని ఆ పార్టీ అధిష్టానవర్గం సంకేతాలు పంపింది. గత రెండు రోజులుగా కాంగ్రెస్ ఎంపీల మధ్య జరుగుతున్న ఘర్షణ దురదృష్టకరమని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ విఠల్‌రావు మంగళవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ నాయకులు మౌనం వహించాలని ఆయన కోరారు. రేపు జరుగనున్న పిసిసి అత్యవసర సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ ఇదే విషయాన్ని చెప్పనున్నారని ఆయన వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో ఐక్యత ముఖ్యమని, తాను ఈ విషయాన్ని లగడపాటి రాజగోపాల్, సర్వే సత్యనారాయణ, మధుయాష్కిలకు ఫోన్ ద్వారా తెలియజేశానని ఆయన చెప్పారు. తెలంగాణ అంశంపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications