రాష్ట్రాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు
హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, విజయావాడ నగరాలు జలమయమయ్యాయి. పాత ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. మరో రెండు రోజులు ఇలాగే భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో జనం భయభ్రాంతులవుతున్నారు. వర్షాల కారణంగా కరీంనగర్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర క్రీడల మంత్రి ఎం సత్యనారాయణరావు పర్యటించారు. వరంగల్, ఖమ్మం జిల్లాలు కూడా భారీ వర్షాల కారణంగా అతలాకుతలమయ్యాయి. రాష్ట్రంలో అనేక బస్సు సర్వీసులు భారీ వర్షాల కారణంగా రద్దయ్యాయి. కోస్తా తీరంలో 40- 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో 30 చెరువులకు గండ్లు పడ్డాయి. కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లా రామగుండంలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications