వైద్యానికి నిధులు తక్కువే: ముఖ్యమంత్రి
హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య రంగానికి కేటాయిస్తున్న నిధులు తక్కువేనని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అంగీకరించారు. ఏసియన్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అసోసియేషన్ మంగళవారంనాడు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఒక కొత్త వైద్య బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సగటున రోజుకు వంద మందికి సహాయం అందిస్తున్నామని, ఒక్కొక్కరికి 40 వేల నుంచి 50 వేల రూపాయల వరకు అందిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులు పేదలకు స్పెషలైజ్‌డ్ వైద్య సేవలు అందించడం హర్షదాయకమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications