వెంకటరెడ్డిపై ప్రత్యేకాభిమానం: దేవేందర్
హైదరాబాద్: గౌరు వెంకటరెడ్డిని ప్రభుత్వం వెనకేసుకోస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు. వెంకటరెడ్డికి ప్రసాదించిన క్షమాభిక్షను రద్దు చేసినా ప్రభుత్వం తాత్సారం చేయడం అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. వెంకటరెడ్డి ఇప్పటికీ లొంగిపోకపోవడం ప్రభుత్వ పనితీరుకే కాకుండా పక్షపాత వైఖరికి కూడా అద్దం పడుతోందని ఆయన విమర్శించారు. వెంకటరెడ్డిపై చర్య తీసుకోవాలని రెండో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప ప్రభుత్వం కదిలే స్థితిలో లేదని ఆయన అన్నారు.
గౌరు వెంకటరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ మంగళవారం నల్లగొండలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోలి సొరాబ్జిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టడం తప్పని సుప్రీంకోర్టు చెప్పిందని, అయినా వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని ఆయన అన్నారు. వెంకటరెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించిన విషయంలో మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం భావించడం దుస్సాహసమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications